reddy's lab inter qulaifiaction mpc-bi.p.c (60%)
చిత్తూరు (కొంగారెడ్డిపల్లె), న్యూస్‌లైన్:హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌లో పలు రకాల ఉద్యోగాల కోసం
అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఆర్‌డీఏ జాబ్స్ డీపీఎం ప్రభావతి తెలిపారు. 19 సంవత్సరాలలోపు
వయస్సు కలిగి ఉండి, ఇంటర్ ఎంపీసీ, బైపీసీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన యువకులు మాత్ర మే
అర్హులని తెలిపారు. ఈనెల 8వ తేదీ ఉదయం 9.30 గంటలకు రాత పరీక్ష ఉం టుందని చెప్పారు.
ఎంపికైనవారికి హైదరాబాద్‌లో మూడు నెలల పాటు శిక్షణ ఇస్తారని, శిక్షణ కాలంలో రూ.8వేల జీతంతో పాటు
భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తారని తెలిపారు. రెడ్డీస్ ల్యాబ్‌కు చెందిన రాష్ట్రంలోని ఇతర ఏ ప్లాంట్లలోనైనా
నియమిస్తారని చెప్పారు. చిత్తూరు, పలమనేరు, కుప్పం, వి.కోట ప్రాంత అభ్యర్థులకు చిత్తూరు పీవీకేఎన్
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, తిరుపతి, పుత్తూరు, నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు ప్రాంత అభ్యర్థులకు తిరుపతి
పాలిటెక్నికల్ కళాశాలలో రాత పరీక్ష ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 9701778944, 9701 778945 నెంబర్లను
సంప్రదించవచ్చని డీపీఎం వివరించారు.
Category:

0 comments